Friday, August 28, 2015

Subramanyam for sale Satellite Rights

Sai Dharam Tej's upcoming entertainer SUBRAMANYAM FOR SALE satellite rights taken by maa


22 comments:

 1. 33 వ వారంలో రాంకులు తారుమారు; నెం.1 మా టీవీ, నాలుగో స్థానంలో ఈటీవీ
  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఇచ్చిన 33వ వారం రేటింగ్స్ లో తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ రాంకులు తారుమారయ్యాయి. మా టీవీ మళ్ళీ చాలా కాలం తరువాత నెంబర్ వన్ స్థానంలోకి రాగా జీ తెలుగు రెండో స్థానానికి పరిమితమైంది. అదే విధంగా జెమిని టీవీ మూడో స్థానంలోకి ఎగబాకటంతో ఈటీవీ తిరిగి నాలుగో స్థానానికే వెళ్ళాలసి వచ్చింది.

  33 వ వారానికి గాను మా టీవీకి 132859 జివిటి లు రావటంతో మొదటి స్థానం దక్కించుకుంది. జీ తెలుగు కు     125082 జివిటి లు రావటంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈటీవీని మించిపోయి జెమిని టీవీ 105533 జివిటిలు తెచ్చుకోవటంలో మూడో స్థానంలో ఉంది. దీంతో ఈటీవీ తిరిగి నాలుగో స్థానానికే వెళ్ళిపోయింది

  ReplyDelete
  Replies
  1. I guess it is because of CINEMAA awards 2015

   Delete
 2. ఇరవయ్యేళ్ల ఈటీవీ ప్రస్థానంలో వెలుగునీడలు
  ఈటీవీ-మీటీవీ అనే మాట ఇంటింటా మారుమోగటం మొదలై అప్పుడే ఇరవయ్యేళ్ళు గడిచింది. చానల్ మొదలవటానికి ముందు రామోజీరావు చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. చానల్ మొదలయ్యాకగాని ఆ విషయం పరిశ్రమలో ఉన్నవాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో 18 గంటల ప్రసారాలు అందించటానికి ఎంత కృషి జరిగి ఉంటుందో ఊహకు సైతం అందదు.  రోజూ సాయంత్రం కేవలం మూడు గంటల ప్రసారాలతో జెమినీ టీవీ ఆరు నెలలముందే  హడావిడిగా మొదలై తెలుగులో మొదటి ప్రైవేట్ శాటిలైట్ చానల్ గా పేరుతెచ్చుకున్నా , ఈటీవీ మాత్రం పకడ్బందీగా 18 గంటల ప్రసారాలతో 1995 ఆగస్టు 27న మొదలైంది. అయితే, జెమినీ 24 గంటలకు ఎదిగినా, చాలా కాలం ఈటీవీ అదే 18 గంటలు కొనసాగించింది

  ReplyDelete
  Replies
  1. Midnight thappa mrng 6:30 nunchi nyt 12:30 varaku ETV vundedhi i guess whereas gemini tv maatram evenin 6-9 or 5:30-8:30 maatrame vachedi...

   Delete
 3. సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు విషయంలో ఈటీవీ చాలా జాగ్రత్త పడింది. టీవీ విషయం బైటికి పొక్కకముందే సినిమా శాటిలైట్ టీవీ హక్కులు కొనేయాలని నిర్ణయించుకొని తన వ్యూహాన్ని అమలు చేసింది.ఆ విధంగా పాత చిత్రాలంటే ఈటీవీ దగ్గరే ఉంటాయన్న అభిప్రాయం అందరిలో పెంచగలిగింది. జెమినీ టీవీని సన్ గ్రూప్ తీసుకోవటానికి ముందువరకూ సన్ నెట్ వర్క్ తో ఈటీవీ కి మంచి సంబంధాలే ఉండేవి. కానీ 1997 లో ఈటీవీ మీద జెమినీ వేసిన కేసు వల్ల ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 31నాడు ప్రేమదేశం సినిమా ప్రసారం చేయబోతుంటే  జెమినీ కోర్టుకెళ్ళింది. ఆ తరువాత  ప్రసారాన్ని నిలిపివేయించింది. నిజానికి ఈటీవీ ట్రాన్స్ పాండర్ వాడుకుంటున్న సన్ యాజమాన్యానికీ ఈ కేసు వ్యవహారం కాస్త ఇబ్బందిగానే మారింది. ఆ తరువాత దళపతి సినిమ విషయంలో ఈ టీవీ కూడా జెమినీ మీద కేసు వేసింది.

  జెమినీ టీవీ ముందుగా ప్రారంభమైనా, ఈటీవీ మాత్రం మొదలైనప్పటినుంచీ అదే నెంబర్  వన్. జెమినీ లో సగం వాటా కొనుక్కొని ఆర్థిక నియంత్రణ తన గుప్పిట్లోనే పెట్టుకున్న  సన్ టీవీ ఎలాగైనా జెమినీని తెలుగులో నెంబర్ వన్ చేయాలన్న పట్టుదలతో ఉంది. సరిగ్గా అప్పుడే ఒక సంఘటన జరిగింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కొత్త సినిమాల ప్రచార ప్రకటనలను నామమాత్రపు ధరకే ప్రసారం చేయాలని ఈటీవీని, జెమినీని కోరాయి. ఈటీవీ ఒప్పుకోలేదు. మిగిలిన వాణిజ్య ప్రకటనల్లాగే లెక్కకడతాం తప్ప ఎలాంటి రాయితీలూ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. జెమినీ ఆ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుంది. ఏకంగా ఉచిత ప్రసారానికి ఒప్పుకుంది. దీంతో నిర్మాతల మండలి నిర్ణయం ప్రకారం  కొత్త సినిమాల షూటింగ్ కి ఈటీవీ ని రానివ్వకుండా, జెమినీ కి మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో సహజంగానే ప్రేక్షకులు సినిమా వార్తలకోసం జెమినీ ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు

  ReplyDelete
  Replies
  1. Appatlo ETV lo new cinema trailers endhuku vachevi kaado telisedi kaadhu,now got to know the reason....
   Prema desam & rakshakudu matter lo kuda Etv & gemini tv ki clash vachindi...coincidentally both films are produced by same production house

   Delete
 4. తెలుగులో డెయిలీ సీరియల్స్ ప్రవేశపెట్టిన ఘనత ఈటీవీ కే దక్కుతుంది. సీరియల్స్ నిర్మాణంలోనూ  చాలా శ్రద్ధ తీసుకునేది. అనేక సీరియల్స్  టైటిల్ సాంగ్స్  సిడి లు అమ్మగలిగేంతగా ప్రాచుర్యం పొందాయి. కళంకిత లాంటి సీరియల్స్  ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనికూడా లేదు. అనేక సీరియల్స్ విజయవంతం కావడంలో స్వర్గీయ సుమన్ పాత్ర ఎంతో ఉంది. ఒకవైపు జెమినీ టీవీ సొంత నిర్మాణమంటూ లేకుండా స్లాట్స్ అమ్మకంతో సురక్షితమైన వ్యాపారం చేసుకూంటూ ఉంటే ఈటీవీ మాత్రం సొంతమౌలిక సదుపాయాలు వాడుకుంటూ స్వయంగా సీరియల్స్ నిర్మిస్తూ వచ్చింది. వైవిధ్యభరితమైన సీరియల్స్ తీయటంలోనూ ఈటీవీ ముందుంది. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళను విశేషంగా ఆకట్టుకున్నాయి.

  ఎంటర్టైన్మెంట్ సంగతెలా ఉన్నా, వార్తల విషయంలో ఈటీవీ తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చింది. నిజానికి చాలా భారీగా ఖర్చుచేసింది కూడా. కొలంబో ఎర్త్ స్టేషన్  నుంచి ప్రసారాలు అప్ లింక్ అవుతున్నాయి కాబట్టి రోజూ మద్రాసు (అప్పటికి అధికారికంగా చెన్నై కాదు ) లో ఆంధ్రావని రికార్డు చేసి నుంచి  విమానంలో పంపాల్సి వచ్చేది. ఆ తరువాత చెన్నై నుంచ్ అప్ లింకింగ్ అందుబాటులోకి వచ్చినపుడు కూడా ఢిల్లీలో సగం బులిటెన్ , చెన్నై లో సగం బులిటెన్ చదివించేవారు. న్యూస్ సెంటర్ కి వార్తలను చేరవేయటానికి వి-శాట్ వాడుకునే వారు. మొత్తంగా చూస్తే ఈ టీవీ 9 గంటల న్యూస్ బులిటెన్ బాగా ప్రేక్షకాదరణ పొందగలిగింది. న్యూస్ తోబాటు అన్నదాత లాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలు ప్రసారం చేయటం కూడా ఈటీవీకే చెల్లింది. లాభాలగురించి ఆలోచించకుండా ఇలాంటి కార్యక్రమాల మీద ఖర్చు చేయటం ఈటీవీకే చెల్లింది. దాదాపు అన్ని చానల్స్ ఆరోగ్యకార్యక్రమాల పేరుతో డాక్టర్లనుంచి డబ్బు వసూలు చేస్తున్నా, ఈటీవీ మాత్రం అలాంటి ధోరణులను దరిజేరనీయలేదు.

  అయితే, వార్తలు మరింత వేగంగా అందించటానికి ఘంటారావం పేరుతో ప్రతి గంటకూ ఐదేసి నిమిషాల చొప్పున వార్తల ప్రసారానికి శ్రీకారం చుట్టింది. నిజానికి ఇది ఆ తరువాత ప్రారంభించబోయే న్యూస్ చానల్ ( ఈటీవీ 2) కి రిహార్సల్ లాంటిది. ఈ ప్రయోగం విజయవంతమైనట్టే పైకి కనిపించినా ఈటీవీకి దారుణమైన నష్టం కలిగించింది. ముఖ్యంగా సాయంకాలం స్లాట్స్ లో ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. సాయంత్రం 7 గంటలకు జెమిని లో సీరియల్ వస్తూ ఉంటే ఈటీవీలో ఘంటారావం వచ్చేది. సీరియల్స్ చూసే ఈ టీవీ ప్రేక్షకులంతా పొలోమంటూ జెమినీ వైపు వెళ్ళేవారు. వార్తలు అయిపోయాక 7.05 కి ఈటీవీ సీరియల్ మొదలైనప్పుడు వెనక్కి వచ్చేవాళ్ళు తక్కువగా ఉండే వారు. ఆ తరువాత సీరియల్ 7.32 కి మొదలయ్యేది. అప్పుడూ అదే పరిస్థితి. జెమినీ కావాలని 7.29 కే సీరియల్ మొదలుపెట్టేది. గంటగంటకూ వార్తల ప్రసారం విజయవంతమైనా, సీరియల్స్ దెబ్బతినటం మొదలైంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ తరువాత ఈటీవీ కోలుకోలేకపోయింది. డబ్బింగ్ సీరియల్స్ అయినా సరే, ప్రేక్షకులు జెమినీకి అలవాటు పడ్డారు.

  ప్రత్యక్ష ప్రసారాల విషయానికొస్తే మాత్రం ఈటీవీ చాలా వెనుకబడింది. ప్రతిధ్వని లాంటి చర్చా కార్యక్రమాలు సైతం రికార్డు చేసి ప్రసారం చేయటం తప్ప ప్రత్యక్షప్రసారాలు చేయలేదు. తప్పులు జరుగుతాయేమోనన్న అనుమానం వెంటాడినట్టు కనిపిస్తుంది. చానల్ మొదలైన దాదాపు 9 ఏళ్లదాకా ప్రత్యక్షప్రసారం చేయలేదు. బిల్ క్లింటన్ పర్యటన ప్రత్యక్షప్రసారం చేయబోయి సమస్యలెదుర్కోవటం వాళ్ళను భయపెట్టిన ఒక అనుభవం. 2003  లో మాత్రమే ఎంటర్టైన్మెంట్ చానల్ లో ఫోన్ ఇన్ కార్యక్రమంతో ప్రత్యక్షప్రసారానికి శ్రీకారం చుట్టారు

  ReplyDelete
  Replies
  1. Those 5 mins news bullitens from ETV used to be so irritating & it has lead to loose viewership of ETV
   Billclinton Hitec city open chesina event was telecasted live exclusively on ETV

   Delete
 5. తెలుగులో తొలి24 గంటల న్యూస్ చానల్ అయినప్పటికీ ఆ విషయాన్ని ధైర్యంగా ప్రచారం చేసుకోవటంలో ఈటీవీ విఫలమైంది. 2003 డిసెంబర్ 29 ఉదయం ప్రసారాలతో ప్రారంభమైనా తొలి తెలుగు న్యూస్ చానల్  అని చెప్పుకోలేని దుస్థితి ఈటీవీ ది. దానికంటే 15 రోజులు ఆలస్యంగా 2004 జనవరి లో మొదలైన టీవీ9 “ తొలి తెలుగు న్యూస్ చానల్ “ అంటూ పదే పదే చెప్పి దాన్నే నిజమని నమ్మేలా చేసింది.  వేగానికీ, కచ్చితత్వానికీ మధ్య ఉండే పోటీలో ఈటీవీ 2 కచ్చితత్వానికి మొగ్గు చూపడంతో వేగంలో వెనుకబడక తప్పలేదు. తెలుగులో తొలి న్యూస్ చానల్ కావటం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకూ రెండు వేరు వేరు చానల్స్ ప్రసారం చేయటం మొదలుపెట్టిన తొలిసంస్థ కూడా ఇదే. ఆ విధంగా ఈ టీవీ 2 పేరు మార్చుకొని ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. ఇంకో కొత్త చానల్ ఈటీవీ తెలంగాణ అయింది.

  ఈటీవీకి విధేయులైన ప్రేక్షకులున్నప్పటికీ పే చానల్ గా మారటానికి చాలా కాలం సాహసించలేదు. సన్ గ్రూప్ మొట్టమొదటగా తేజ టీవీని, ఆ తరువాత జెమినీ టీవీని పే చానల్స్ గా మార్చేదాకా ఈటీవీ సాహసించలేక పోయింది. అంతెందుకు, ఆరంభంలోనే పే చానల్ అయిన మా టీవీ కంటే కూడా ఈటీవీ ఆలస్యంగా పే చానల్ అయింది.  కాకపోతే న్యూస్ చానల్ కు కూడా కొంత నామమాత్రపు ధర పెట్టి రెండూ కలిపి ఇవ్వటం మొదలుపెట్టారు.

  తెలుగు సంగతలా ఉంచితే, ఈటీవీ దేశమంతటా విస్తరిస్తూ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించింది. వివిధ భాషల్లో ఎంటర్టైన్మెంట్, న్యూస్ చానల్స్ ప్రారంభిస్తూ కొద్దికాలంలోనే తన ప్రత్యేకత చాటుకుంది. అయితే, ఆ తరువాత కాలంలో ఎక్కువ భాగం చానల్స్ ను వదిలించుకోవటం విశేషం. తెలుగు మినహా ఇతర భాషల్లోని చానల్స్ ను వదులుకోవటం కూడా వ్యూహాత్మకమేనని చెబుతారు. కానీ ఈటీవీ బ్రాండ్ తమకే ఉండిపోయేలా ఒప్పందం చేసుకోవటం వల్ల మళ్ళీ ఈటీవీ విస్తరణ కార్యకలాపాలు మొదలవుతాయని భావించవచ్చు.

  సినిమాలు కొనటం దాదాపుగా ఆపేసిన ఈటీవీ ఇటీవలికాలంలో గేమ్ షోస్, రియాల్టీ షోస్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. సొంత నిర్మాణమనే కాన్సెప్ట్ పక్కనబెట్టి  ఔట్ సోర్స్ చేయటం మొదలుపెట్టింది. విధానపరంగా ఈటీవీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమిది. అయితే, ఇది ఫలించింది. ప్రేక్షకాదరణ పొందగలిగే కార్యక్రమాలు రూపొందుతున్నాయి. అయితే, అదే సమయంలో కొన్ని విమర్శలూ తప్పలేదు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో జుగుప్సాకరమైన ద్వంద్వార్థాలు వాడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నా, పట్టించుకున్నట్టు లేరు.  ఈటీవీ నుంచి ఈ తరహా కార్యక్రమాలు అందుతాయని ఎవరూ ఊహించలేదు. అందుకే ఈటీవీ ని ఎంతగానో గౌరవించేవారు కూడా ఈ దిగజారుడుతనాన్ని మాత్రం క్షమించరు

  ReplyDelete
  Replies
  1. Tholi Telugu News channel maatram ETV2 ne then came TV9 but enni news channels vachina ETV news ki unde credibility ETV ke undhi...ee vishayam recent ga ETV@20 programe lo pawan kalyan kuda cheppatam jarigindhi

   Delete
 6. ఒక దశలో ఈటీవీ దగ్గర శాటిలైట్ ప్రసార హక్కులున్న సినిమాల సంఖ్య 1450 కి చేరుకుంది. అప్పట్లో అది చాలా పెద్ద సంఖ్య. కానీ మూవీస్ చానల్ గాని మ్యూజిక్ చానల్ గాని పెట్టలేదు. ఇతర భాషల్లో చానల్స్ పెట్టటం ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించటం మీద దృష్టి సారించిందే తప్ప తెలుగులో సినిమాల ప్రసార హక్కులను సద్వినియోగం చేసుకొలేకపోవటం ఈటీవీ తప్పిదమనే చెప్పాలి. ఇప్పుడు సినిమాల సంఖ్య  సగానికి సగం తగ్గిపోయిన తరువాత ఆ ఆలోచనను ఆచరణలో పెడుతోంది. ఇప్పుడు కొత్తగా మరికొద్ది రోజుల్లొనే  నాలుగు చానల్స్ ప్రసారం చేయటానికి అన్నీ సిద్ధం చేసుకోవటం అందులో భాగమే.

  త్వరలో మరో నాలుగు వానల్స్ ప్రారంభించబోతున్న ఈటీవీ గ్రూప్ అంతటితో ఆగబోవటం లేదు. మళ్ళీ జాతీయస్థాయిలో బుల్లితెర విప్లవం తీసుకురావాలన్నదే రామోజీరావు ఆలోచన. న్యూస్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఆయన కొత్తగా చూడాల్సిందేమీ లేదు. కొత్తదనం, ప్రజాప్రయోజనం రెండూ ఉండాలనే దృక్పథంతో ప్రజలకు పనికొచ్చే చానల్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయించుకొని ఆ దిశలో అడుగులేస్తున్నారు. ఆయన ఆలోచనావిధానాన్ని జాగ్రత్తగా గమనించే వారికి మాత్రం ఆయన మనసులో మాట ఈ పాటికే అర్థమై ఉండాలి

  ReplyDelete
  Replies
  1. ETV deggara unna more than half movies Gemini & Maa ki renew ayipoyayi...ippudu new movie channel pettaru,inka nunchi ayina new movies teeskuntaro ledho vehci chudali

   Delete
 7. Excellent piece of info about ETV's history siva...keep up the good work bro:)

  ReplyDelete
 8. Appatlo Rakshakudu mve Ugadi spl ga nonstop ga mng nundi 9t varaku gemini &Etv lo vachindi

  ReplyDelete
  Replies
  1. Avnu shyam...Etv,Gemini & Siti cable pota potiga Rakshakudu movie ni telecast chesayi appudu

   Delete
 9. appudu a 3 channels ela play chesayi bro

  ReplyDelete
  Replies
  1. That i also dont know bro,siti cable ante adhi cable channel so oka movie gemini teeskunna etv teeskunna a movie vaallu kuda teeskoni vese vaallu

   Delete
 10. GEMINI TV Is Always King of All Telugu Channels.....

  Most Awaiting All Power Star Fans' POWER STAR PAVAN KALYAN'S SARDAR GABBAR SIGH '
  Max. Chances 101% To GEMINI TV. .. . .! ! !

  Maa, Zee Ani Madhyalo Enni Channels Vichhina. .
  GEMINI TV Race modalupettihe Raculo Evvaru Aapaleru ...
  Final Winners Is GEMINI TV & E TV's Only .....................

  HISTORICAL VICTORY FROM TEAM INDIA'S TEST CAPTIAN VIRAT KOHILI '. .. . .! ! !
  VIRAT Only The Feature Captian Of ODI & Even T20's Also . It's Very SooooooN . ... .

  One Of Fav. Player VIRAT KOHILI & Team Won The Test Series Aganist Sri lanka After 23 Years In Sri Lnka....
  &
  360 Angle Daring Dangerious AB DEVILLERS Broken Gangulys World Fastest 7000 & 8000 Runs Record....
  I'm Feeling Very Proud Be An Big Fan Virat & ABD .. .. . .! ! ! ! !

  I Hope VIRAT, GAYLE & AB Will Give IPL Season 9 Cup To RCB ....!!!!!!!

  ReplyDelete
 11. GEMINI TV, GEMINI MOVIES & GEMINI MUSIC'S Like a POWER STAR PAWAN KALYAN Always NO.1 ...

  Virat, Chris Gayle & AB Devillers ..Bolwer Evarina Kavochu Only Sixers Ball ni Boundari Datinchadame ma Target ..

  Like GEMINI Channels No.1 Is Our Target.........! ! !

  ReplyDelete